తెలంగాణబ్యూరో//జూలై 27(ఆకాంక్ష) :

ఉత్తర తెలంగాణ జిలాల్లో ఆ నియోజక వర్గం ఎప్పుడు రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది. ఆ నియోజకవర్గంలో జరిగే రాజకీయ పరిణామాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తాయి అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు. అయితే ఇప్పటికే అధికారి పార్టీకి ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ కంటిమీద కునుకు లేకుండా చేస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ క్రమంలో రాజకీయ పరంగా జరిగే పరిణామాలు తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. ఉత్తర తెలంగాణ రాజకీయాలకు హాట్‌స్పాట్‌గా నిలిచిన ఓ కీలక నియోజకవర్గంలో తాజాగా క్రషర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అధికార పార్టీ నాయకుల మీద ఇప్పటికే ఆ నియోజకవర్గంలో బూడిద, ఇసుక రాదంతం కొనసాగుతు విమర్శల పాలవుతున్న తరుణంలో ఇప్పుడు క్రషర్ పనుల నిలిపివేత అంశం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.ఆ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల సమీపంలో కొనసాగుతున్న క్రషర్ కార్యకలాపాలను స్థానిక ఓ ప్రజాప్రతినిధి జోక్యంతో నిలిపివేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ కేంద్రాల వరకు ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది.రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా, ఎవరిని అడిగినా క్రషర్ వివాదం గురించే చర్చ సాగుతున్నట్లు ప్రచారం జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.అయితే సంబందించిన కంపెనీ నుండి తమకు సుమారు 20 లక్షల వరకు వాటా ఇవ్వాలని సదురు ఓ ప్రజా ప్రతినిధి యజమానులకు హుక్కుం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అక్కడ పనులు నడవకుండా ఇప్పటికే రోడ్లను సైతం తవ్వించారని పలువురు గుసగుస లాడుకుంటున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు ఇది మరో అస్రంగా మారడంతో అధికార పార్టీ మరింత ఇరకాటంలో పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరి నోటా విన్న ఇదే మాటలు వినిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కొంత మంది సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం.కొందరు సొంత పార్టీ నేతలే ఈ వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ అంశం రాజకీయంగా మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వేళ, ఇలాంటి ఆరోపణలు వారికి మరింత బలమైన అస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలు, క్రషర్ వివాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.