మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారు ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా శాఖంబరి దేవి రూపంలో భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో సుందరంగా అలంకరించగా, అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు, మహా మంగళహారతులు నిర్వహించారు. శాఖంబరి దేవి రూపంలో అలంకరించిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కళకళలాడింది.ఆషాఢమాసం తొలి ఆదివారం సందర్భంగా అమ్మవారి దర్శనం అత్యంత పుణ్యప్రదమని విశ్వసించే భక్తులు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేయగా, క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రతా చర్యలను సమర్థంగా నిర్వహించారు.శాఖంబరి దేవి అలంకరణను దర్శించుకున్న భక్తులు అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విశేష అలంకరణ భక్తులను ఆధ్యాత్మిక భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.
మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ ఫ్లెక్సీలను చింపేసిన కాంగ్రెస్ కార్యకర్తలు మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ గ్రూపు తగాదాలు దండేపల్లి మండలంలో గూడెం గ్రామంలో ఎంపీ వంశీ కృష్ణ పర్యటన పై స్థానిక కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు మరో వర్గం నాయకులు సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహం రెండు గ్రూపుల మధ్య గొడవ.. అడ్డుకున్న పోలీసులు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, రైతు మారగోని కరుణ కుమారస్వామి ఈ వినూత్న ప్రయత్నం చేశారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో తొలకరి జల్లులు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే నార్లు పోసిన పొలాల్లో నీరు లేక నారుమడులు ఎండిపోతుండటంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసిన రైతులు ఇప్పుడు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ మేఘాలు కనిపించినా వర్షం కురవకపోవడంతో రైతన్నల్లో నిరాశ నెలకొంది. వర్షాలు మరింత ఆలస్యమైతే ఈ సీజన్‌లో సాగు పూర్తిగా దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రైతు మారగోని కరుణ కుమారస్వామి తన హృదయంలోని బాధను పదాలుగా మలిచి వానదేవుడిని వేడుకుంటూ గీతాన్ని ఆలపించారు. "ఓ వానదేవుడా... మా పొలాలపై కరుణ చూపించు... తొలకరి జల్లులు కురిపించు... మా నార్లను కాపాడు... రైతన్న బతుకుకు అండగా నిలువు" అనే భావాలతో కూడిన ఆ పాట ప్రతి రైతు మనసులోని వేదనను ప్రతిబింబించింది.పాటలో రైతుల కష్టాలు, పంటలపై ఉన్న ఆశలు, ప్రకృతిపైనే ఆధారపడిన వ్యవసాయ జీవితం ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. వర్షాలు లేక రైతు పడుతున్న ఆవేదనను కళ్లకు కట్టినట్లు వివరించడంతో గ్రామస్థులు భావోద్వేగానికి గురయ్యారు.
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ రామగుండం పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా గోదావరిఖని ఏసిపి మడత రమేష్, మంథని సీఐ రాజుకు నేరుగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీకి ఇంకా ఎన్ని సంవత్సరాలు తొత్తుగా వ్యవహరిస్తారో చూస్తామని హెచ్చరించారు.పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ రహదారిపై మంథని ప్రాంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు రహదారిపై నినాదాలు చేశారు. అయితే పోలీస్ కమిషనర్ ను కలిసేందుకు వెళ్తున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పుట్ట మధుకర్ మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేయడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ విషయంలో పోలీసులు అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. మృతి చెందిన బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలను ఎగ్గొట్టడానికి పుదారి సతీష్ మీద కేసు పెట్టారు. చావుకు కారణం ఐన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాపాడవచ్చు. అని ఏ1 నిందితుడిని పక్కన పెట్టి ఏ2 ఐన పుదారి సతీష్ ను పోలీసులు పట్టుకొని పోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిని కాపాడటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దొంగ కేసులు పెడతారా.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గోదావరిఖని ఏసీపీ మడత రామేష్,మంథని సీఐ రాజు మీరు ఇద్దరు ఏ బొక్కలో ఉన్న విడిచి పెట్టేది లేదు. మీరు ఇంకా ఉంటారా ఐదు లేఖ పది సంవత్సరాలు ఉద్యోగాలల్లో, రాబోయే రెండు సవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. మీరు ఎక్కడికి పోయిన విడిచి పెట్టాం. శ్రీధర్ బాబు తో పాటు నీ జోకర్ తమ్ముడు పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు అరాచకాలు సృష్టిస్తున్నాడని అన్నారు. భవిష్యత్తులో అందరూ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. ముత్తారం ప్రాంతానికి చెందిన బండ రాజు ఆత్మహత్యకు కారకుడైన కాంగ్రెస్ నేతను పక్కనపెట్టి బీఆర్ఎస్ నాయకులు అరెస్టు చేయడమేంటని పోలీసులను ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీస్ కమిషనర్ ను కలిసి అన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు
పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీష్ రావు పెద్దపల్లి జిల్లాలోని ఓ సీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన,బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న పోలీసు వేధింపులను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ సమావేశంలో మాట్లాడిన హరీష్‌రావు, జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారిని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆ అధికారిని స్థానికంగా “బబ్లు” అనే ముద్దు పేరుతో పిలుస్తున్నారని పేర్కొంటూ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహారాలపై సమీక్ష జరుపుతామని హెచ్చరించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా చర్యలు జరుగుతున్నాయని ఆరోపించిన హరీష్‌రావు, రైతు బీమా, రైతుబంధు, ధాన్యం కొనుగోలు వంటి ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తున్నందుకే కార్యకర్తలపై ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపించారు.ఈ నెల 2వ తేదీన శ్రీకాంత్ అనే బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి జరిగిందని తనకు సమాచారం అందిందని హరీష్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అదే శ్రీకాంత్తో కేసు పెట్టించి తను అనుభవించిన దాని కంటే రెట్టింపు బాధను అనుభవించేలా నీ సంగతి చూస్తామని ఘాటుగానే హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో మంగళవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పాత వ్యవసాయ బావి నిరంతరం కూలుతూ ఉండడంతో దానికి మరమ్మత్తులు చేస్తూ చుట్టూ గాజులు వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా భావి కూలడంతో అక్కడే పని చేస్తున్న ఇద్దరు కూలీలు బావి కింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఒక మృతదేహాన్ని బయటకి తీయగా మరో మృతదేహం బావిలోనే ఇరుక్కపోయినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని పుట్నూరు గ్రామ శివారులో శుక్రవారం ఉదయం వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఆసుపత్రికి తరలించారు.స్థానికుల వివరాల ప్రకారం.. పుట్నూరు ఐకేపీ కేంద్రం నుంచి వడ్ల లోడ్ తీసుకుని సుల్తానాబాద్ వైపు వెళ్తున్న లారీ గ్రామ శివారులో రోడ్డు గుంతల కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బసంత్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్ గండికోట రాజేందర్ తీవ్రంగా గాయపడ్డాడు.జయ్యారం క్రషర్ల నుంచి ఓవర్‌లోడ్‌తో భారీ లారీలు తరచూ రాకపోకలు సాగించడం వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై ఏర్పడిన పెద్ద గుంతల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. మరోవైపు లారీలో అధిక లోడ్ ఉండటంతోనే వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు.
హనుమాన్ మాల ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని కొలుస్తూ దాదాపు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నడుచుకుంటూ కొండగట్టు ఆలయానికి వస్తున్న ఆంజనేయ స్వామి భక్తులకు ఆలయ నిర్వహకులు ప్రత్యేక దర్శనానికి అనుమతించాలని పాదయాత్ర స్వాములు కోరారు. అంతే కాకుండా పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకునే ఆంజనేయ స్వామి భక్తులకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని స్వాములు ఆవేదన వ్యక్తం చేశారు.
బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నందుకే సైడ్ ఎఫెక్ట్ అయి వెంట్రుకలు ఊడిపోయి గుండు అయింది. బండి సంజయ్‌కు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలని నేను అంటున్నాను - బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మీరు మీ గుండాలతో తో Rfcl ప్లాంట్ గేట్ ముందు చేస్తున్న కార్మికుల పై చేస్తున్న దౌర్జన్యానికి ప్రత్యేక్ష ఉదాహరణ కార్మికులు మీతో లేకపోవడమే అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు మీ వీధినాటకాలకు తెర దించకపోతే కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తే మీకు కార్మిక క్షేత్రం లో తగిన గుణ పాఠం తప్పదు
రుద్రంగి అడవి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేములవాడ నుంచి కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కథలాపూర్ మండలానికి చెందిన దీక్షిత్ (37), సహజ (29), నందిని (27)లతో పాటు నలుగురు చిన్నారులు వేములవాడ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. రాత్రి సుమారు రెండు గంటల సమయంలో రుద్రంగి అడవి మార్గంలో ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డుకు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి మర్రి ప్రశాంత్, పైలట్ తోట నరేందర్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాధితులకు ప్రథమ చికిత్స అందించారు.అనంతరం గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. అడవి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. వేగం, నిద్ర మత్తు లేదా వాహన నియంత్రణ కోల్పోవడం కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
మేడ్చల్//ఏప్రిల్ 25(ఆకాంక్ష) : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మేడ్చల్ జిల్లా మునిరాబాద్‌లోని ఆధ్వరా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీకి “తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)” అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు.సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ వేదికగా పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా నాయకులు పార్టీకి మద్దతు ప్రకటిస్తూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా పార్టీ పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు.
నరుకుతా పొడుస్తా అనే వాళ్లకు మీరు ఏ విధంగా మద్దతిస్తారు.. ఎమ్మెల్యేను నరికిన వాళ్లు ఈ రోజు ఏం ముల్లె కట్టుకున్నారు.. అడ్డంగా నరికి చచ్చి పోయిండు అనుకోని రైల్వే ట్రాక్ మీద పడేసి వెళ్లిపోయిన వాళ్ళు ఈ రోజు ఏం మూల్లె కట్టుకున్నారు.. మీరు నరికి ఏ ముల్లె కట్టుకుంటారు. కత్తులు పెట్టుకుని తిరుగుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఏమైనా అంటే కండలు చూపించి బెదిరిస్తున్నారని ఆర్‌ఎఫ్‌సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ అంబటి నరేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంథనిలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13:తెలంగాణ చరిత్రను, భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో ఓ ప్రముఖ రాజకీయ పార్టీ ఏప్రిల్ 25న ప్రజల ముందుకు రానున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించిన ఈ పార్టీ ప్రవేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా భారీ సభను నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయని, పార్టీ విధానాలు, లక్ష్యాలను ప్రజలకు వివరిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 12: సమాజ అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తోంది. యువ మిత్రులు, మహిళలు, మేధావులు తమ విలువైన సూచనలు, సలహాలను నేరుగా తెలియజేయాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి సమర్థవంతమైన పరిష్కారాలను అందించేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని వారు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు సంస్థ కార్యక్రమాలను మరింత మెరుగుపరచడానికి దోహదపడతాయని తెలిపారు. అందువల్ల, ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ 6302480305 మరియు ఈమెయిల్ ఐడి feedback@telanganajagruthi.org అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రజల సహకారంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని, అందరూ ముందుకు వచ్చి తమ సూచనలు అందించాలని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేసింది.
జాగృతి పార్టీ ఏర్పాటు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 21 కమిటీలు వేశాం. ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారు. వాలంటీర్లు 500 మంది ఉంటారు. సభ సజావుగా జరిగిలే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు కమిటీ సభ్యులు చర్యలు తీసుకుంటారు.
రామగుండం తహసిల్దార్ లేకపోవడంతో ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతున్నందుకు ఆగ్రహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేశారు. 15 రోజుల క్రితం తహసిల్దార్ బదిలీపై వెళ్లగా, డిప్యూటీ తహసిల్దార్ కూడా అందుబాటులో లేకపోవడంతో పత్రాల జారీ నిలిచిపోయిందని బాధితులు తెలిపారు.ఉన్నత విద్య ప్రవేశాల గడువు సమీపిస్తుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సిబ్బందిని బంధించి నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు.తక్షణమే శాశ్వత తహసిల్దార్‌ను నియమించాలని జిల్లా అధికారులను బాధితులు డిమాండ్ చేశారు.
కార్మికుల సంక్షేమం, భద్రత, ఆదాయ భరోసా వంటి అంశాలపై స్పష్టమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.భవిష్యత్తులో కల్వకుంట్ల కవిత ప్రారంభించబోయే కొత్త రాజకీయ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆటో కార్మికులు ప్రకటించారు.
భూపాలపల్లి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్యుడిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రజల ముందే వైద్యుడిని అవమానిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం స్థానికంగా సంచలనంగా మారింది.భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, విధుల్లో ఉన్న ప్రభుత్వ వైద్యుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల సమక్షంలోనే “చెత్తనా కొడకా”, “యూస్‌లెస్ ఫెలో” అంటూ వైద్యుడిని దూషించడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.
సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కరించండి లేదంటే ప్రభుత్వంపై ఆందోళన తపదు ఇక అని డిమాండ్ చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత త్వరలో ప్రజా భవన్ ముట్టడి.
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని లింగాపూర్ మోడల్ స్కూల్ సమీపంలో మంగళవారం ఉదయం ఒక బస్సు అదుపు తప్పిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం, బస్సు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.అయితే, ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ మరియు కండక్టర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
బద్ధలైన అగ్నిపర్వతం...హిందూ మహాసముద్రంలో కలిసిన లావా
Amid global challenges, India is moving forward with new confidence.
A Perfect Comedy Scene from mana shankara vara prasad garu
Kannamochi Yenada
jaishriram jaishriram jaishriram jaishriram
Shot & Edit @absolutelyrahul Location