యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కరీమా బేగం...

హైదరాబాద్//జూన్ 11(ఆకాంక్ష) :

మొయినాబాద్‌లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలైన కరీమా బేగం మృతి చెందింది. ఆబేదా బేగం, మహబూబా హత్య కేసులో కరీమా బేగం ప్రధాన నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే.పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, అప్పుల భారం నుంచి బయటపడేందుకు కరీమా బేగం ఇద్దరు వృద్ధ మహిళలను హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.ఇదిలా ఉండగా, ఇటీవల కరీమా బేగం యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కరీమా బేగం మరణంతో ఈ సంచలన కేసులో తదుపరి న్యాయపరమైన ప్రక్రియలపై ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, కేసుకు సంబంధించిన ఇతర నిందితులపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.