కేసు నమోదు చేసి మృతుడి వివరాలను సేకరిస్తున్న పోలీసులు...

హైదరాబాద్//జూన్10(ఆకాంక్ష) :

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడటంతో మృతి చెందిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ వైపు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. బస్సు శాతంరాయి ప్రాంతానికి చేరుకున్న సమయంలో వెనుక డోర్ వద్ద ఉన్న అతడు అకస్మాత్తుగా కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలను సేకరిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.