మృతుల సంఖ్య 9కు చేరిక...

విశాఖపట్నం//జూన్10(ఆకాంక్ష) :

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 9కు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు చికిత్స పొందుతూ బుధవారం సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు.ప్రమాదం జరిగిన నాటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పైడిరాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మృతితో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కు పెరిగింది.ప్రస్తుతం సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో మరో ఇద్దరు, విశాఖలోని కిమ్స్‌ ఆస్పత్రిలో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన అధికారులు నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.