గోదావరిఖని ఏసిపి మడత రమేష్, మంథని సీఐ రాజుకు మాజీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్...

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ రామగుండం పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా గోదావరిఖని ఏసిపి మడత రమేష్, మంథని సీఐ రాజుకు నేరుగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీకి ఇంకా ఎన్ని సంవత్సరాలు తొత్తుగా వ్యవహరిస్తారో చూస్తామని హెచ్చరించారు.పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ రహదారిపై మంథని ప్రాంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు రహదారిపై నినాదాలు చేశారు. అయితే పోలీస్ కమిషనర్ ను కలిసేందుకు వెళ్తున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పుట్ట మధుకర్ మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేయడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ విషయంలో పోలీసులు అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. మృతి చెందిన బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలను ఎగ్గొట్టడానికి పుదారి సతీష్ మీద కేసు పెట్టారు. చావుకు కారణం ఐన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాపాడవచ్చు. అని ఏ1 నిందితుడిని పక్కన పెట్టి ఏ2 ఐన పుదారి సతీష్ ను పోలీసులు పట్టుకొని పోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిని కాపాడటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దొంగ కేసులు పెడతారా.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గోదావరిఖని ఏసీపీ మడత రామేష్,మంథని సీఐ రాజు మీరు ఇద్దరు ఏ బొక్కలో ఉన్న విడిచి పెట్టేది లేదు. మీరు ఇంకా ఉంటారా ఐదు లేఖ పది సంవత్సరాలు ఉద్యోగాలల్లో, రాబోయే రెండు సవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. మీరు ఎక్కడికి పోయిన విడిచి పెట్టాం. శ్రీధర్ బాబు తో పాటు నీ జోకర్ తమ్ముడు పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు అరాచకాలు సృష్టిస్తున్నాడని అన్నారు. భవిష్యత్తులో అందరూ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. ముత్తారం ప్రాంతానికి చెందిన బండ రాజు ఆత్మహత్యకు కారకుడైన కాంగ్రెస్ నేతను పక్కనపెట్టి బీఆర్ఎస్ నాయకులు అరెస్టు చేయడమేంటని పోలీసులను ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీస్ కమిషనర్ ను కలిసి అన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు.