• కేశరాజుపల్లి జంక్షన్ వద్ద ఘటన

నల్గొండ,//మే 17(ఆకాంక్ష) :

నల్గొండ భైపాస్ రోడ్డులోని కేశరాజుపల్లి జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు, బైక్ ఢీకొనడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రమాదం తీవ్రతకు బాధితురాలు రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాధితురాలిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.