– టీచర్ యువతి దారుణ హత్య...

జడ్చర్ల//మే16(ఆకాంక్ష) :

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే మృతి చెందింది.మృతురాలు జడ్చర్లలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. నిత్యం లాగే పాఠశాల పనులు ముగించుకుని బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో నిందితుడు ఆమెను అడ్డుకుని దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యేందుకు యత్నించినట్లు సమాచారం.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అతనిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ దారుణ ఘటనతో జడ్చర్ల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.